NTV Telugu Site icon

Laapataa Ladies: ఆస్కార్‌ రేస్ లో పేరు మారిన ‘లాపతా లేడీస్‌’

Lapata

Lapata

బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌ రావు దర్శకత్వం వహించిన చిత్రం ‘లాపతా లేడీస్‌’. 2001లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘లాపతా లేడీస్‌’. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను సినిమాగా అద్భుతంగా మలిచారు దర్శకురాలు కిరణ్ రావ్. నితాన్షి గోయల్, స్పర్శ్ శ్రీవాస్తవ్ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Also Read : RGV : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మకు నోటీసులు

కాగా ‘లాపతా లేడీస్‌’ఇండియా తరపున 2025 ఆస్కార్‌ అవార్డ్స్ కు ఎంపికయింది. అందులో భాగంగ ‘ఆస్కార్‌’ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌ను మార్చారు మేకర్స్. ఆస్కార్స్ కోసం ‘లాపతా లేడీస్‌’ పేరును ‘లాస్ట్‌ లేడీస్‌’ గా మార్చారు. హాలీవుడ్ ఆడియెన్స్ కు పేరు సులభంగా పలికేలా పేరును మార్చినట్టు తెలుస్తోంది.  ఆస్కార్‌  అవార్డ్స్ నుద్దేసించి ఈ చిత్ర నిర్మాత ఆమిర్‌ అక్కడి మీడియాతో  మాట్లాడుతూ ‘‘2002లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్స్ కు నేను నటించిన  ‘లగాన్‌’  ఎంపికైంది. ఇప్పుడు నేను నిర్మించిన ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ క్యాంపెయిన్‌కు రావడం ఆనందంగా ఉంది.  ఆస్కార్స్ అకాడమీలో ప్రత్యేక కమిటీలు ఉంటాయి. తమకు కేటాయించిన వాటిలో 80శాతం చిత్రాలను మాత్రమే వారు చూస్తారు. డబ్బులు ఖర్చు పేటి ఖరీదైన  గిఫ్ట్స్ ఇస్తే వాళ్లు చూస్తారు అనుకుంటారు. అదంతా అబద్దం. అలాంటి వాటికి ఇక్కడ ఛాన్స్‌ ఉండదు. మన సినిమాని మనమే ప్రమోట్‌ చేసుకోవాలి. అందరికీ తెలిసేలా చేయాలి’ అని అన్నారు.

Show comments