లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఓ కొత్త చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నయన్ తాజాగా నటించిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘నిజల్’. ఈ చిత్రంలో నయనతారతో పాటు చాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక సైజు కురుప్, దివ్య ప్రభ, రోనీ డేవిడ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజల్’ మూవీ మే 11న ‘సింప్లి సౌత్’ అనే ఓటిటి వేదికపై విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఇటీవలే నయనతార ‘అమ్మోరుతల్లి’గా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నయన్ ఖాతాలో ఇప్పుడు పలు తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలు ఉన్నాయి. మరోవైపు తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ తో పెళ్లి విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ.