NTV Telugu Site icon

Kubera : ధనుష్ నాగార్జున మల్టీ స్టారర్ ‘కుబేర’ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ ఎప్పుడంటే..?

Kubera

Kubera

తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘కుబేర’.      జాతీయ అవార్డ్ విజేత దర్శకుడు శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను ఈ నెల 15న విడుదల  చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ నాగార్జునను మెలాంచోలిక్ లైట్‌లో ప్రదర్శిస్తూ, క్యూరియాసిటీ క్రియేట్ చేసిన పోస్టర్‌లో నాగార్జున ఖరీదైన సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్న లుక్ లో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లోని సిటీ లైట్స్  మరియు అతని చుట్టూ ఉన్న స్పష్టమైన సంపద ఉన్నప్పటికీ, జీవితంలో ఎదో కోల్పోయిన కుబేరుడుగా ఉన్నారు నాగార్జున.  కుబేర నుండి ఇదివరకే రిలీజ్ అయిన ధనుష్,  రష్మిక మందన్న  పోస్టర్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also Read : Kanguva : విడుదలకు ముందే కేరళలో కంగువ రికార్డ్

శేఖర్ కమ్ముల యొక్క అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు, కుబేర సస్పెన్స్ అంశాలతో కూడిన  గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్  లో ఉన్న ఈ సినిమా పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశ ఇప్పటికే జరుగుతోంది మరియు ఫస్ట్ గ్లిమ్స్ తో కుబేర ప్రమోషన్స్ ను ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోన్న కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది.

Show comments