Site icon NTV Telugu

Kubera : నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ధనుష్ ..

Kubera

Kubera

ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. నాగార్జున, ర‌ష్మిక ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వం వహించగా, ల‌వ్‌స్టోరి వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రం త‌ర్వాత త‌న స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను తెర‌కెక్కిచాడు. ఇప్పటికే విడుదలైనా పాట‌, గ్లిమ్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌నే క్రియేట్ చేయగా. జూన్ 20న ఈ చిత్రం థియేట‌ర్లలోకి రానుంది. ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ ప్రమోష‌న్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. కాగా..

Also Read : Aliya : ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను..

టీజ‌ర్ ప్రారంభ‌ంలో నాదే నాదే.. నేల‌ నాది.. గింజ నాది అంటూ ప‌వ‌ర్‌పుల్ పాట‌ బ్యాగ్రౌండ్‌లో ప్లే అవుతుండ‌గా సినిమా క‌థ‌ను దాదాపు చెప్పే ప్రయ‌త్నం చేశారు. అంతేకాదు ధ‌నుష్‌, నాగార్జున‌, ర‌ష్మిక, బాలీవుడ్ న‌టులు జిమ్ ష‌ర్బ్‌ , ద‌లిప్ త‌హిల్ పాత్ర తీరుల‌ను చూయించి చాలా రోజులుగా ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల‌కు మంచి అదిరిపోయే ఫీల్ ఇచ్చారు. మొత్తనికి టీజర్ చూస్తుంటే శేఖ‌ర్ క‌మ్ముల ఈ సారి కొత్తగా ఏదో చెప్పబోతున్నాడ‌నేది అర్థమ‌వుతోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ నాగార్జున పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. ‘నాగార్జున చిత్రాలు అంటే తమిళనాడులో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంటుంది.. నాకు వ్యక్తిగతంగా నాగ్ సినిమాలు అంటే ఎంతో ఇష్టం.. ముఖ్యంగా ఆయన నటించిన రచ్చగన్(రక్షకుడు) నా ఆల్‌టైమ్ ఫేవరెట్. ఆయనతో వర్క్ ఎక్స్‌పిరియన్స్ ఎప్పటికి మర్చిపోలేను. చాలా మంచి మనిషి ’ సినిమా అని ధనుష్ తెలిపారు.

Exit mobile version