NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ సంచలన ట్వీట్

Allu Arjun Ktr

Allu Arjun Ktr

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదారాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సంధర్భంగా అల్లు అర్జున్ హైదరాబాదు సంధ్య థియేటర్ కి వెళ్ళారు. ఆయన వస్తున్నారని తెలిసి టికెట్ లేని వారు సైతం ఆయనను చూసేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో ఒకానొక సందర్భంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడు. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడం కారణంగానే తాము సరైన పోలీసు బలగాన్ని అక్కడ నిలపలేకపోయామని పోలీసులు బాహాటంగానే విమర్శించారు. సమాచారం ఇవ్వని అల్లు అర్జున్ టీం సహా టీం మీద కేసులు నమోదు చేశారు.

Allu Arjun Arrest : బన్నీ అరెస్ట్ కేసులో అదే జరిగితే అంతే..?

అదేవిధంగా సంధ్య థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సంధ్య థియేటర్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ అరెస్టు మీద సంచలన ట్వీట్ చేశారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అని ఆయన ప్రశ్నించారు. నేరుగా అల్లు అర్జున్ తప్పు లేకపోయినా అల్లు అర్జున్ ను ఒక సాధారణ నేరస్థుడిగా పరిగణించడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన ఈ చర్యను నేను ఖండిస్తున్నాను అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దిక్కుమాలిన లాజిక్‌తో కనుక అరెస్ట్ చేస్తే, హైదరాబాద్‌లో హైడ్రా భయంతో సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని ఆయన అన్నారు.