Site icon NTV Telugu

Kriti Sanon : ధనుష్ నటనకు ఫిదా అయిన కృతి సనన్ ..

Kriti Sanon Praises Dhanush

Kriti Sanon Praises Dhanush

కోలీవుడ్ హీరో ధనుష్ తన నటనతో ఇప్పటికే తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా.. అతని టాలెంట్ అక్కడే ఆగలేదు.. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ చక్కటి నటనతో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా, ‘రాంజనా’, ‘అత్రంగి రే’ తర్వాత ధనుష్ – ఆనంద్ కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేస్తూ ధనుష్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ఆమె మాట్లాడుతూ..

Also Read : Nayanthara: నన్ను వాడుకున్నారు.. నయన్ షాకింగ్ కామెంట్స్

‘నేను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన అత్యుత్తమ నటుల్లో ధనుష్ ఒకరు. అతనితో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఎంతో స్పెషల్‌గా మిగిలిపోతుంది’ అని పేర్కొంది. అలాగే, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ గురించి కూడా ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.. ‘ఈ సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు సర్. ఇది ఓ రోలర్ కోస్టర్ రైడ్‌లా వేగంగా పూర్తైపోయింది’ అని తెలిపింది. ఇది ధనుష్, కృతి సనన్ జంటగా నటిస్తున్న మొదటి సినిమా, అందుకే ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది.

Exit mobile version