టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నానితో “శ్యామ్ సింగ రాయ్”, రామ్ తో “రాపో 19”, సుధీర్ బాబుతో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” వంటి చిత్రాలతో పాటు ఇతర భారీ ప్రాజెక్టులలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సీరియల్ లో కనిపించబోతోంది అనే విషయంపై ఇండస్ట్రీలో హాట్ చర్చ నడుస్తోంది. కృతి ఓ ప్రముఖ ఛానల్ తో లాభదాయకమైన ఒప్పందంపై సంతకం చేసింది.
Read Also : “ఏకే” రీమేక్ లో “భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్
ఆమె ఓ తెలుగు సీరియల్ ప్రోమోలో నటించడానికి అంగీకరించింది. ఈ ప్రోమో నిన్న ప్రసారం అయ్యింది. ఇది చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్‌లో నటించినందుకు కృతి కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుందట. బుల్లితెరపై ఇది చాలా ఎక్కువ రెమ్యూనరేషన్. కానీ ప్రస్తుతం క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి. ఈ యువ నటి తన తొలి చిత్రం “ఉప్పెన”తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే.
