Site icon NTV Telugu

AIG Doctors: కృష్ణంరాజు మృతి కారణం అదే.. ఏఐజీ వైద్యులు

Aig Krishnam Raju

Aig Krishnam Raju

Krishna Raju has severe pneumonia in his lungs: సీనియర్‌ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీనిపై ఏఐజీ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. కృష్ణంరాజుకు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కృష్ణంరాజు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు కృష్ణంరాజు కాలుకు గతేడాది శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. కొవిడ్ అనంతరం ఆనారోగ్య సమస్యలతో ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారని స్పష్టం చేశారు. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా వల్ల ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఏర్పడిందని, కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించామన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 నిమిషాలకు గుండెపోటు రావడంతో కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారని ఏఐజీ వైద్యులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు సినీ పరిశ్రమలో రెబల్‌ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. హైదరాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు తెలుగు సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కృష్ణంరాజు.
Krishnam Raju Funeral Rites: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు.. సీఎస్‌కు ఆదేశించిన సీఎం కేసీఆర్‌

Exit mobile version