Site icon NTV Telugu

JIGRIS : సందీప్ రెడ్డి వంగా సమక్షంలో ఛాలెంజ్ చేసి.. హిట్ కొట్టిన యంగ్ హీరో

Jigris

Jigris

రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. ఆ తర్వాత దిల్ రాజు యొక్క ATM వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ నిర్మించిన కృష్ణమ్మలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జిగ్రీస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లీడ్ రోల్ లో నటించాడు కృష్ణ. ఆవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన జిగ్రీస్ ఈ నెల 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. స్పిరిట్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేసాడు.

Also Read : Mega Star : ఐ – బొమ్మ వాళ్లు సవాళ్లు విసురుతుంటే తట్టుకోలేకపోయా

మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కృష బూరుగుల నటనకు ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుండి మంచి ప్రసశంలు అందుకుంటున్నాడు. సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా వచ్చిన జిగ్రీస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకుంటే తాను నటన మానేస్తానని  జిగ్రీస్ సినిమాను DJ టిల్లు, జాతి రత్నాలు మాదిరి నవ్విస్తానని అయన ముందే సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు కృష్ణ బూరుగుల. అందుకు తగ్గట్టే ‘చిచోర్’ పాత్రలో కృష్ణ సినిమాను ఆసాంతం తన భుజాలపై మోశాడు. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ తో థియేటర్ లో నవ్వులు పూయించాడు. ఎమోషన్ సీన్స్ లోను కృష్ణ నటన మెప్పించాడు. డిఫ్రెంట్ స్లాంగ్ తో కృష్ణ నటన యూత్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలతో కృష్ణ బూరుగులా ఆడియెన్స్ ను అలరించబోతున్నాడు.

Exit mobile version