Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లుపై క్రిష్ జాగర్లమూడి షాకింగ్ పోస్ట్

Krish

Krish

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి తొలుత దర్శకత్వం వహించాడు. కొంత మేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా హరిహర వీరమల్లు దర్శకత్వ భాద్యతల నుండి తప్పుకున్నాడు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్నఈ సినిమాకు సంబంధించి క్రిష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : HHVM : వీరమల్లు రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ ఆకలి తీర్చిన పవర్ స్టార్

క్రిష్ ఏమన్నారంటే ‘ హరి హర వీర మల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. కానీ నిశ్శబ్దంగా కాదు. ప్రతి ఫ్రేమ్ లో చరిత్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసేందుకు వస్తున్నాడు. ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. సినిమాలోనే కాదు, ఆత్మ విశ్వాసంలోనూ మన పవన్ కళ్యాణ్ ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా చూపించలేని ఒక పవర్ ఉంది.  ఆయన నిత్యం మండే స్ఫూర్తి హరి హర వీరమల్లులోకి ప్రాణం పోసింది. ఆయన హరిహర వీరమల్లుకు వెన్నెముక. A.M. రత్నం ఒక గొప్ప శిల్పి. బలమైన విశ్వాసంతో సినిమాలు నిర్మించగలడం ఆయన సామర్థ్యం. హరిహర వీరుమల్లు సినిమా తెరకెక్కిందంటే అది ఆయన అచంచలమైన బలం వల్లనే. ఈ సినిమా నా గొప్ప సినిమాలలో ఒకటి. దర్శకుడిగా మాత్రమే కాదు, మరచిపోయిన చరిత్రను అన్వేషించేవాడిగా, సత్యాలను అన్వేషించేవాడిగా, ప్రపంచ నిర్మాణానికి అవకాశంగా, అన్నింటికంటే ముఖ్యంగా, వినోదాన్ని మరియు జ్ఞానోదయాన్ని అందించే సినిమాను నమ్మేవాడిగా నా కెరీర్ లో ఇదో గొప్ప సినిమా. ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక మరియు అచంచలమైన కృతజ్ఞతను అందిస్తున్నాను. ఇప్పుడు, సంవత్సరాల తరబడి కొనసాగిన అగ్ని మరియు విశ్వాసం యొక్క ముగింపు చివరకు చేరుకుంది. ఇది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండబోతుంది. ప్రేమ మరియు కోపంతో క్రిష్ జాగర్లముడి’ అని ఆయన వ్యక్తిగత ఖాతలో ట్వీట్ చేసారు.

Exit mobile version