Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్‌లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!

Director Krish

Director Krish

Mahishasuramardhini: టాలీవుడ్‌లో విభిన్నమైన స్టోరీలు, ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన డైరెక్టర్ క్రిష్.. ప్రస్తుతం తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆయన ఓ యానిమేషన్ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘మహిషాసురమర్ధిని’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. క్రిష్ ఇప్పటివరకు చారిత్రక, పీరియాడిక్, సామాజిక అంశాలతో కూడిన స్టోరీలను తనదైన మేకింగ్‌తో తెరకెక్కించారు. ఇప్పుడు తొలిసారిగా యానిమేషన్ జానర్‌లో సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు కామన్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జానపద అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని టాక్.

ఇక ‘మహిషాసురమర్ధిని’ అనే టైటిల్ కావడంతో ఈ సినిమా స్టోరీపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా? లేక పురాణ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని కొత్త కథను చెప్పబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే సినిమా కథ, పాత్రలు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు వార్తలు రావడంతో ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ కూడా రాని ఈ సినిమాపై ప్రత్యేక బజ్ అనేది క్రియేట్ అయ్యేలా చేస్తోంది. యానిమేషన్ సినిమాలకు భారీ స్థాయిలో విజువల్స్, సాంకేతిక నైపుణ్యం అవసరం కావడంతో ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు ప్రచారం అవుతున్న ఈ యానిమేషన్ మూవీపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ‘మహిషాసురమర్ధిని’ అనే టైటిల్ ఈ చిత్రానికి ఖరారైతే, క్రిష్ కెరీర్‌లోనే ఇది అత్యంత విభిన్నమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కథ, పాత్రలు, నిర్మాణ వివరాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.