Anushka: శీలావతిగా అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ…అందరికీ నమస్కారం. కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఘాటి అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. చింతకింద శ్రీనివాసరావు గారు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. నేను స్వీటీ వేదం సినిమాలో కలిసి పనిచేశాం. అందులో సరోజ పాత్రను పోషించింది. ఇప్పుడు ఘాటిలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది.
Also Read:Tadipatri: జేసీ vs కాకర్ల.. గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ!
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. ఘాటిలో కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా చేసింది. తను సూపర్ స్టార్ డమ్ లో వుంది. వేదం నుంచి ఇప్పటివరకు స్టార్ డమ్ లో అనేక రెట్లు ఎదిగింది. తన మనసు మాత్రం అలాగే ఉంది. ఈ సినిమా కథ చెప్పగానే చాలా అడ్వంచర్ తో కూడుకున్న మూవీ తప్పకుండా చేద్దాం అని చెప్పింది. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. సెన్సార్ కి ఇచ్చేముందు కాపీ చూసుకుని అనుష్కకి ఫోన్ చేశాను. తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది ఒక ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాను. అదే మాట ఆడియన్స్ కచ్చితంగా చెప్తారు. ఈ కథ రాస్తున్నప్పుడే శీలావతి పాత్ర అనుష్క గారు చేయాలని నేను మా ప్రొడ్యూసర్ రాజీవ్ గారు సాయిబాబా గారు విక్రమ్ ప్రమోద్ వంశీ డిసైడ్ అయ్యాం. దేశిరాజు క్యారెక్టర్ లో విక్రమ్ ప్రభు గారిని ఊహించుకుని రాశాను. ఆయన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తారు.ఇందులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయనే ఈ పాత్రకు తన సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పుకున్నారు. అలాగే కుందుల నాయుడు క్యారెక్టర్ కి చైతన్య పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లన్నీ ఎక్స్ట్రార్డినరీ. జగపతిబాబు గారి క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక సూత్రధారిలాగా ఉంటుంది. మొదటి సీను, చివరి సీను ఆయనతోనే ఉంటుంది. ఒక మంచి కథకి మంచి నటీనటులు టెక్నిషియన్స్ దొరకడం అదృష్టం. తోట తరిణి గారు లాంటి ప్రొడక్షన్ డిజైనర్. ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్, సాయిమాధవ్ బుర్ర గారి డైలాగులు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఘాటి సినిమాకి హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్. సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. కనీ, విననీ పాత్రలు ఈ ఘాటిలో చూస్తారు. చాలా మంచి సినిమా తీశాం. ఘాటి సినిమాలో ఒక అందమైన సోల్ ఉంది. ఆడియన్స్ ఆ సోల్ ని మనసులో నింపుకుని వెళ్తారు. సెప్టెంబర్ 5న తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. అని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!