బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’ మరియు ‘క్రిష్ 3’ లు అద్భుత విజయం సాధించాయి. ఓ సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘క్రిష్ 4’ తెరకెక్కబోతుంది.తాజాగా ఈ మూవీ గురించి సిద్ధార్థ్ ఆనంద్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.అయితే 2021లోనే ‘క్రిష్ 4’ మూవీ గురించి అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని హృతిక్ రోషన్ అప్ డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదని తెలుస్తుంది. దాంతో ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత సిద్ధార్థ్ ఆనంద్ తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ‘అతను వస్తున్నాడు’ అనే క్యాప్షన్‌తో క్రిష్ గెటప్ లో ఉన్న హృతిక్ రోషన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..ఆ పోస్ట్ కి ‘అవును అతను వస్తున్నాడు’ అని సిద్ధార్థ్ ఆనంద్ బదులిచ్చారు. దీనితో ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడింది. కానీ దీని గురించి ఇంకా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ -2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.వార్ 2 సినిమా తర్వాత క్రిష్-4 గురించి ఏమైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి.
https://twitter.com/Real_Box_0ffice/status/1785276198425436242?