Site icon NTV Telugu

Koratala Siva : దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించే హీరో ఇతనే..?

Untitled Design (40)

Untitled Design (40)

మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్  హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్  బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో  హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి నటించిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : Devara : దేవర ఓవర్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్.. రికార్డులు తిరగరాస్తున్నJr. NTR
అవేమి పరంగానలోకి తీసుకోకుండా తనకు జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడికి దేవర సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు తారక్. ఈ చిత్రం విజయం కొరటాలకు చాలా కీలకం. ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర తర్వాతి చిత్రం ఏంటి అనే ప్రశ్న చాల మందిలో ఉంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మేరకు కొరటాల నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కొరటాల శివ తర్వాత సినిమాలో హీరోగా నటిస్తున్నాడని ఈ మేరకు కథా  చర్చలు ముగిశాయని, ప్రణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ ముల్టీస్టారర్ ను  నిర్మించనుంది. గతంలో కొరటాల డైరెక్షన్ లో వచ్చిన జనతగ్యారేజ్ లో  మోహన్ లాల్ కీలక రోల్ లో నటించిన సంగతి తెలిసిందే
Exit mobile version