కోలీవుడ్ స్టార్ కపుల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకుని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన సతీమణి జ్యోతికతో కలిసి వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. వ్యాక్సినేటెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలను షేర్ చేయగా… అవిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సూర్య సోదరుడు, హీరో కార్తీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో సూర్య తన అభిమానులకు సహాయం చేయడమే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా భారీ విరాళాన్ని అందించారు.
Read Also : భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ ?
సూర్య తన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీలతో కలిసి మేలో తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. కరోనా కష్ట సమయంలో పనిని కోల్పోయిన తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేశారు సూర్య. 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5000 వారివారి ఖాతాలలో వేశారు. సూర్య సోదరుడు కార్తీ కూడా తన అభిమానులకు సహాయం అందించారు. తాజాగా వ్యాక్సినేషన్ వేయించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక “ఆకాశం నీ హద్దురా” చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.