Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లే మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అది కూడా విజయ్‌కు పోటీగా పాలిటిక్స్ లోకి వస్తారా? అటు కోలీవుడ్‌లో, అరవ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు ధనుష్ రాజకీయాలకు రావచ్చంటూ సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. తమిళనాడులో సినీ రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని బంధం ఉంది. ఎమ్జీఆర్, జయలలిత నుంచి నిన్నటి విజయ్ వరకు ఎంతోమంది సినీతారలు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా రాణించారు, సీఎంలు అయ్యారు.
ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై ధనుష్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజా, ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుందన్నారు. కస్తూరి రాజా వ్యాఖ్యలతో ధనుష్ రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.
Also Read
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
తాజావార్తలు
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!