Site icon NTV Telugu

2026 Pongal : తమిళ తంబీల జేబులే టార్గెట్ !

Tollywood Vs Kollywood

Tollywood Vs Kollywood

2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్. బాలా వనంగాన్, మదగరాజా, జయం రవి కాదలక్కే నేరమిల్లే సినిమాల్లో విశాల్ ఫిల్మ్స్ మాత్రమే మెప్పించగలిగింది.

ఈ సంక్రాంతికి ఫీస్ట్ మిస్సైన తమిళ తంబీలకు నెక్ట్స్ పొంగల్ డల్‌గా ఉండదని ప్రామిస్ చేస్తోంది కోలీవుడ్.భారీ ఫీస్ట్ రెడీ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దళపతి జననాయగన్ జనవరి9న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. విజయ్ లాస్ట్ మూవీ అంటూ ఊదరగొట్టడంతో సింపథీ గట్టిగానే వర్కౌటై… అడ్వాన్స్ బుకింగ్ రూపంలో టికెట్లు బాగానే తెగెట్టుగానే కనిపిస్తున్నాయి. సంక్రాంతి ముగిసే వరకు థియేరట్లను తనే రూల్ చేద్దామని అనుకుంటే.. ఇద్దరు హీరోలు బ్రేకులేసేట్లుగానే ఉన్నారు.

దళపతి విజయ్‌తో పోటీగా సూర్య వచ్చే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తోన్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్.. కరుప్పు దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉందని టాక్. ఇయర్ ఎండింగ్‌పై వా వాతియార్‌తో బ్రదర్ కార్తీ కర్చీఫ్ వేసేసరికి.. సంక్రాంతికి షిఫ్టై అయ్యాడట సూర్య. పొంగల్ రేసులోకి పక్కా రాబోతున్నాడని కోలీవుడ్ టాక్.
స్పాట్ః Karuppu (Tamil) – Teaser | Suriya | RJB | Trisha | ‪@SaiAbhyankkar‬ | Dream Warrior Pictures

విజయ్, సూర్యతో పోటీ పడబోతున్నాడట శివకార్తీకేయన్. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పరాశక్తిని పొంగల్‌కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ బజ్. శ్రీలీల ఈ సినిమాతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అధర్వ, జయం రవి, రానా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. యాక్చువల్లీ సూర్యతో ఇదే మూవీ ప్లాన్ చేసింది సుధా కొంగర. కానీ క్రియేటివ్ డిఫరెన్స్‌స్ వల్ల.. శివ చెంతకు చేరిందీ ఈ ప్రాజెక్ట్. వీటితో పాటు టాలీవుడ్ నుండి రాజా సాబ్ కూడా పోటీగా మారబోతున్నాడు. మరీ ఈ లెక్కన చూస్తే నెక్ట్స్ సంక్రాంతి మాత్రం.. ఈ పొంగల్ గా ఉండదు అని చెప్పొచ్చు. మరి ఈ రేసులోకి ఇంకా ఎన్ని వస్తాయో.. ఎన్ని తప్పుకుంటాయో…?

Exit mobile version