NTV Telugu Site icon

Sreeleela : బాలీవుడ్ ఆఫర్ పట్టిన కిస్సిక్ క్వీన్

Sreeleela

Sreeleela

తెలుగు నటి శ్రీ లీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. దర్శకుడు కరణ్ జోహార్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించినప్పటి నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే అది ప్రచారమే అని తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ఆ వార్త నిజం కాదని తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తన రాబోయే ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటించడానికి ఆమెను ఎంపిక చేసుకున్నాడు.

Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?

ఇది నిజమైతే, శ్రీలీలకి ఇది ఒక క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో వరుస హిట్‌లను అందిస్తున్నాడు. యువతలో మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. అయితే ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటించడం అనేది ప్రస్తుతానికి ప్రచారమే కాగా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. నిజానికి అల్లు అర్జున్ “పుష్ప 2″లో తన ఐటెం సాంగ్ విజయం తర్వాత శ్రీలీల బాలీవుడ్‌లో పాపులారిటీని సంపాదించుకుంది. “కిసిక్” పాట తెలుగులో మామూలుగానే అనిపించినా హిందీలో మాత్రం బాగా వైరల్ అయింది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు శ్రీలీలను తమ సినిమాలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.