బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం’ అనే డైలాగులతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. హీరో, హీరోయిన్ సహా కొంతమంది స్నేహితుల ఆత్మలని అన్వేషిస్తూ సువర్ణ మాయ ఇంటిలోకి వెళ్తారు. అక్కడ వారు ఊహించని భయంకరమైన పరిస్థితులు ఎదురుకావడం మైండ్ బ్లోయింగ్ థ్రిల్ ని అందించాయి.
Also Read:KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఒక యూనిక్ హారర్ థ్రిల్లర్ ని ప్రజెంట్ చేశారు. మిస్టరీ, టెర్రిఫిక్ విజువల్స్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ట్రైలర్ క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ కనిపించిన తీరు హైలెట్ గా నిలిచింది. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, చైతన్య భరద్వాజ్ సంగీతం థ్రిల్ ని మరింతగా పెంచాయి. సెట్స్ గ్రాండ్ గా వున్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వున్నాయి. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. ఈ చిత్రానికి జి. కనిష్క క్రియేటివ్ హెడ్, దరహాస్ పాలకొల్లు కోరైటర్. మొత్తంమీద ట్రైలర్ కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.
