Site icon NTV Telugu

Kishkindhapuri : కిష్కింధపురి.. ప్రీమియర్.. బెల్లంకొండకు ఓ మంచి హిట్

Kishkindhapuri

Kishkindhapuri

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా వస్తున్న చిత్రం కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగల్లపాటి  దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం కొండ శ్రీనివాస్.

Also Read : TWM Sequel : నిర్మాత – డైరెక్టర్ కు మధ్య వివాదం.. ఆగిన సూపర్ హిట్ సినిమా సీక్వెల్

తాజాగా ఈ సినిమా ప్రీమియర్ ను AAA మల్టిప్లెక్స్ లో ప్రదర్శించగా యునానిమాస్ గా పోజిటివ్ టాక్ తెచ్చుకుంది. విరూపాక్ష తర్వాత తెలుగులో హారర్ జానర్ లో మంచి సినిమాలు రాలేదు. ఆ లోటుని ఇప్పుడు కిష్కింధపురి తీర్చిందని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ లో కాసిన నవ్వులతో పాటు కావాల్సినంత భయపెట్టాడు దర్శకుడు. కిష్కింధపురిలోని సువర్ణ మాయలో ఏమి జరిగిందనే దాన్ని ఉత్కంఠను ఏక్కడ ట్రాక్ తప్పకుండా అద్భుతంగా తెరకెక్కించారు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఊహించిన దానికంటే బిన్నంగా ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్ లో బెల్లంకొండ, అనుపమ కెరిర్ బెస్ట్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి. అలానే తమిళ నాటుడు శాండీ బాగా భయపెట్టాడు. ఇక బాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. హారర్ సినిమాలో కీలకమైన సౌడింగ్ ఈ సినిమాలో చాలా చక్కగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నైట్ లొకేషన్స్ కూడా తెరపై అద్భుతంగా ప్రెసెంట్ చేసాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడ కంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా గురించి ఒక లైన్ లో చెప్పాలంటే 125నిమిషాల కిష్కిందపురి సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చేసేలా చేస్తుంది.

Exit mobile version