సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు చూడనున్నారు. ఈ స్క్రీనింగ్ సమయంలో దర్శకుడు కిరణ్‌రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి-బ్లాక్ ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్’ స్పెషల్ షో వేయనున్నారు. ఈ సినిమాను అమిర్ ఖాన్ నిర్మించగా ఆయన మాజీ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించింది.
Also Read : NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా కథాంశాన్ని ఎంచుకుని, లింగ సమానత్వాన్ని, చాటి చెప్పే కామెడీ డ్రామా ఫిల్మ్ గా తెరకెక్కించారు దర్శకురాలు కిరణ్ రావ్. ఈ ఏడాది మార్చి లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలై ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. కొన్ని వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో లాపతా లేడీస్ స్ట్రీమింగ్ చేయగ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ -1 లో కొనసాగి అద్భుత స్పందన రాబట్టింది. మరోవైపు ఈ సినిమాను రిలీజ్ కు ముందుగానే గతేడాది సెప్టెంబరు 8న ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టీఐఎఫ్‌ఎఫ్) వేడుకలో ప్రదర్శించారు. టీఐఎఫ్‌ఎఫ్ కమిటీ సభ్యుల నుండి ప్రశంసలు దక్కించుకుంది లాపతా లేడీస్.