NTV Telugu Site icon

Kiran : పెళ్లి అయితే .. సక్సెస్ వస్తుంది.. అందుకే పెళ్లి చేసుకోండి..

Ka

Ka

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా ‘క’(Ka). దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది ఈ సినిమా. మౌత్ టాక్ కు తోడు కంటెంట్ సరికొత్తగా ఉండడంతో భారీ వసూళ్లు రాబడుతోంది ‘క’. వీకెండ్స్ రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది క. పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ కెలెక్షన్స్ రాబట్టడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి గా ఉంది.

Also Read : Nikhil : సినిమా రిలీజ్ ఇప్పుడే.. మరి ప్రచారం ఎప్పుడో..?

తాజాగా ‘క’ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరంను ఫిల్మ్ జర్నలిస్టులు పలు ప్రశ్నలు వేశారు. వాటికీ అంతే ఆనందంగా సమాధానం ఇచ్చాడు కిరణ. ఈ సక్సెస్ మీట్‌లో  రహస్య బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ సక్సెస్ ను ఎలా ఫీల్ అవుతున్నారు అని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘పెళ్లి తర్వాత మంచి జరుగుతుందని అంటారు. కానీ మరీ ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు. ఎవరైనా సక్సెస్ కాకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తేగ వైరల్‌గా మారాయి. తన మొదటి సినిమా రాణి గారు రాజా వారు లో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్‌ ని పెళ్లి చేసుకున్నాడు. ‘క’ మూవీ ఇంత హిట్ కావడంతో ఈ సక్సెస్‌ క్రెడిట్‌ను తన భార్యకు కూడా ఇచ్చారు. ఈ సినిమాకు రహస్య అన్ని తానై వ్యవహరించింది.

Show comments