NTV Telugu Site icon

Kiran: టాలీవుడ్ యంగ్ హీరో సినిమా వాయిదా..!

February 7 (71)

February 7 (71)

తెలుగు ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉన్నప్పటికి సరైన హిట్ లేని యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. కానీ గత ఏడాది అబ్బవరంకు బాగా కలిసి వచ్చింది. అటు పర్సనల్‌గా, ఇటు ప్రొఫెషనల్‌గా గత ఏడాదిని ఆయన ఎప్పటికీ మర్చిపోలేడు.అతను ప్రేమించిన రహస్య గోరక్‌తో పెళ్లి..అతను నటించిన ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వంటివన్నీ అని గత ఏడాదిలోనే జరిగాయి. ఇక ఈ ఏడాదిని మరింత పాజిటివిటీ కిరణ్ అబ్బవరం స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం కిరణ్ ‘దిల్ రూబ’ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Also Read:Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..

విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సర్ ఢిల్లోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యిన ఈ మూవీ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇక తాజాగా ఈ మూవీకి రిలీజ్‌కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. తొలుత ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారట. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే సమాచారం ప్రకారం ఇప్పుడు ‘దిల్ రూబ’ మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.