NTV Telugu Site icon

KiranAbbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ రిలీజ్ ఎప్పుడంటే.. రైట్స్ కొనుగోలు చేసిన స్టార్ హీరో..?

Untitled Design (21)

Untitled Design (21)

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. . పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు సరికొత్త ఇమేజ్ తెస్తుందని భావిస్తున్నాడు.

Also Read : kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..

ఈ సినిమాలో 40 నిమిషాలు పాటు అబ్బురపరిచే VFX సన్నివేశాలు ఉండబోతున్నాయట. దేవర సినిమాకు గ్రాఫిక్ వర్క్ చేసిన కంపెనీ ‘క’ సినిమాకు vfx వర్క్ చేస్తోంది.కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అతంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబరులో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ అక్టోబరు 31న దీపావళి కానుకగా వచ్చే అవకాశం ఉంది. అదే రోజు రిలీజ్ కావాల్సిన ఓ యంగ్ హీరో సినిమా వెనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అందుకే ఆ డేట్ కోసం చుస్తున్నారు ‘క’ టీమ్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాను మలయాళంలో ప్రముఖ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత సంస్థ వేఫారర్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ నూయి నందిపాటి వంశీ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Show comments