NTV Telugu Site icon

Kiran Abbavaram : ‘క’ ఓటీటీ రిలీజ్ పై వాళ్లు అలా.. నిర్మాత ఇలా..

Kaott

Kaott

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ ఆయిన ఈ సినిమా దీపావళి విన్నర్ గా నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరం కు ఈ సినిమాతో భారీ హిట్ దక్కింది. సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను తెరకెకెక్కించారు.

Also Read : KA : ‘క’ సినిమా పాన్ ఇండియా రిలీజ్ డేట్స్ ఇవే.

కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై గందరగోళం నెలకొంది. అసలేం జరిగిందంటే ‘క’ ఓటీటీరైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ దక్కించుకున్నట్టు కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సదరు సంస్థ నిన్న తమ సోషల్ మీడియా ఖాతలో ‘ నిన్న మా ఆఫీస్ కు ఒక లెటర్ వచ్చింది, నవంబరు కు వస్తున్నాం’ అని ‘క’ ఓటీటీ ఈటీవీ విన్ లో అని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కొద్దీ సేపటి తర్వాత ‘క’ ఓటీటీ ఇప్పుడే రాదు. మీరందరూ మా సినిమాను థియేటర్లలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి దీనికి సంబంధించి ఏవైనా అసత్య ప్రసారాలు నమ్మొద్దు అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ అయిన శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్.

Show comments