NTV Telugu Site icon

Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

Ka

Ka

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూడు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా విభిన్న కథాంశంతో ప్రేక్షులను విశేషంగా అలరించిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాకు కలెక్షన్స్ తో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా ఈ సినిమా యూనిట్ ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు అందించారు. ‘క’ సినిమాను చూసిన మెగాస్టార్ మూవీ టీమ్ కు తన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి తమ కృతజ్ఞతలు తెలిపారు క సినిమా టీమ్.

Also Read : RukminiVasanth : రానున్నది ‘రుక్మిణి వసంత’ కాలం

“క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో “క” సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండవ వారంలోను ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికి బ్రేక్ ఈవెన్ దాటిన ఈ సినిమా బయ్యర్స్ లాభాల బాటలో పయనిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు నటించిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Show comments