Site icon NTV Telugu

Kiran Abbavaram : జాక్ పాట్ కొట్టిన కిరణ్ అబ్బవరం..రైట్స్ ఎంత ధర పలికాయో తెలుసా..?

Untitled Design (13)

Untitled Design (13)

హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క”. సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ ‘క’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సారి రొటీన్ మాస్ కథలు కాకుండా సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ నెలకొంది.

“క” టీజర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాలకుగాను రైట్స్ దక్కించుకునేందుకు రెండు పెద్ద సంస్థలు పోటిపడ్డాయి. ఫైనల్ గా టాలీవుడ్ కి చెందిన ఒక లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.12 కోట్లకు రైట్స్ కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. కిరణ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది భారీ ధర అని చెప్పొచ్చు. ఈ చిత్రం కథపై నమ్మకంతో సదరు సంస్థ భారీ ధర పెట్టినట్టు తెలుస్తోంది. తానూ ఈ చిత్రంతో కమ్ బ్యాక్ ఇస్తానని ఈ యంగ్ హీరో గట్టి నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరానికి జోడిగా నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా, సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషలలో రానున్న ఈ చిత్రాన్ని శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే థియేటర్లలో విడుదల కానుంది.

 

Also Read: Mr.Bachchan: గబ్బర్ సింగ్ నువ్వా ..నేనా..తెలియాలంటే చూడాల్సిందే..?

Exit mobile version