Site icon NTV Telugu

Kiran Abbavaram: ఎథిక్స్ లేవా.. జర్నలిస్ట్ ప్రశ్నకు కిరణ్ అపవరం సమాధానమిదే?

Kiran Abbavaram

Kiran Abbavaram

అదేంటి ఒక హీరోని పట్టుకుని “ఎథిక్స్ లేవా?” అని అడుగుతున్నారు అనుకోకండి. ఈ ప్రశ్న అడిగింది ఒక ఫిలిం జర్నలిస్ట్. కిరణ్ అబ్బవరం హీరోగా ‘కె ర్యాంప్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా 17వ తేదీ సాయంత్రం మీడియాతో సమావేశమైంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు, “ఈ సినిమాలో ఉన్న లూడో డైలాగ్ ఉందా? సెన్సార్ వాళ్ళు కట్ చేశారా?” అని ప్రశ్నించారు. దీంతో కిరణ్ అబ్బవరం స్పందిస్తూ

Also Read:Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..

“ఆ డైలాగు లేదని, మేమే దాన్ని వద్దనుకున్నామని,” అన్నారు. దానికి జర్నలిస్ట్ “మీరేమో సకుటుంబ సపరివార సమేతంగా సినిమా చూడమని చెబుతున్నారు. సినిమాలోనేమో లూడో లాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ బూతులు లాగా అనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాకు ఫ్యామిలీతో కలిసి చూడమని ఎలా ప్రమోట్ చేస్తున్నారని” ఆయన ప్రశ్నించారు. దానికి కిరణ్ అబ్బవరం, “సదరు క్యారెక్టర్ చిల్లరగా ప్రవర్తిస్తుంది కాబట్టి, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ రాసుకున్న డైలాగ్ అది,” అని అన్నారు.

Also Read:JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై శింబు షాకింగ్ కామెంట్స్

అయితే, “ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు తీసేసారు?” అని సదరు జర్నలిస్ట్ ప్రశ్నించారు. “అంటే అది బూతు లాగా అనిపిస్తుంది అని మీకే అనిపించి తీసేసారు కాబట్టి, మీకు ఎథిక్స్ లేవా?” అంటూ ఆయన ప్రశ్నించారు. “ఎథిక్స్ ఉంటే ముందే అలాంటి డైలాగ్స్ ఉన్న కంటెంట్ నేను చేయను అని చెప్పేవారు కదా?” అని ప్రశ్నిస్తే, కిరణ్ అబ్బవరం “దీనికి నా దగ్గర సమాధానం లేదు. మీరు నన్ను ఏదో ఇరకటంలో పెట్టాలని అడుగుతున్నట్లు అనిపిస్తోంది,” అంటూ సైలెంట్ అయ్యారు. ఇదే విషయం మీద వెంటనే మైక్ అందుకున్న నరేష్ తన వర్షన్ వినిపించారు. మొత్తం మీద కిరణ్ అబ్బవరాన్ని మాత్రం ఈరోజు ఒక ఫిలిం జర్నలిస్ట్ నిజంగానే ఇరుకున పెట్టాడని చెప్పొచ్చు.

Exit mobile version