Site icon NTV Telugu

Deepika Padukone : తల్లి పాత్రలో దీపిక..

Deepika Padukune

Deepika Padukune

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది దీపికా పదుకొణె . 2007లో ‘ఓం శాంతి ఓం’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తన అందం నటనతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ అనతి కాలంలోనే టాలెంట్ తో కోట్లల్లో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు బాలీవుడ్‌లో అత్యదిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ కూడా దీపికనే. ప్రజంట్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపిక చివరగా తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో నటించి దక్షిణాది ఆడియెన్స్‌ను కూడా ఫిదా చేసింది. అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్ తాజా సమాచారం ప్రకారం తల్లి పాత్రలో నటించబోతుందట..

Also Read: Happy Birthday Allu Arjun: హీరో మేటీరియలే కాదన్నారు.. కట్‌చేస్తే ‘పుష్ప’తో ప్రభంజనం సృష్టించాడు!

బాలీవుడ్ హిట్ జోడీల్లో షారుక్ ఖాన్, దీపికా పదుకొణెల జంట ముందు వరుసలో ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’,‘పఠాన్’ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఎంతో అలరించగా. ఇప్పుడు ఈ జోడీ మరోసారి తెరపైకి రానుందట. షారుక్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో ‘కింగ్’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపిక ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అది కూడా సుహానాకు తల్లిగా దీపికను ఎంపిక చేసిందట చిత్రబృందం. ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడానికి దీపికా కూడా చాలా ఉత్సాహంగా ఉందట. ప్రస్తుతం ఈ విషయంపై ఆమెతో చర్చలు చేస్తోందట చిత్రబృందం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version