Site icon NTV Telugu

Kingdom : ‘కింగ్‌డ‌మ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే !

Kingdom (3)

Kingdom (3)

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రెడి అవుతోంది. తాజా సమాచారం మేరకు, జూలై 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్‌ నుంచి ఒక స్టార్ హీరో చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని ఇండస్ట్రీలో బజ్ వినిపిస్తోంది.

Also Read : Shruti Haasan : నన్ను ఎవ్వరు నమ్మలేదు.. పవన్ కల్యాణ్ తప్ప

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ప్రాజెక్ట్‌పై భారీ నమ్మకంతో ముందుకెళ్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్‌ మోత మోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలో తారల సందడి, లైవ్ పెర్ఫార్మెన్స్ లు ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్పీచ్‌పై అభిమానులకి బోలెడు ఆసక్తి ఉంది.

Exit mobile version