Site icon NTV Telugu

Kingdom : ‘కింగ్డమ్’ ఓటిటి డేట్ లాకయ్యిందా?

Kingdiom

Kingdiom

టాలీవుడ్‌ లో భారీ అంచనాల నడుమ విడుదలైన్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్‌గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం కాస్త గట్టేకిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా.. ఈ సినిమా ఓటీటీలో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జోరుగా వార్తలు అందుకుంటున్నాయి. థియేటర్‌లో సినిమా ఇంకా రన్ అవుతుండగానే.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ బయటకు రావడం అందిరకీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. మరి నిజంగానే చెప్పిన డేట్‌కు కింగ్డమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందా? లేదంటే.. 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుందా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version