Site icon NTV Telugu

VD 12 : కింగ్‌డమ్.. ఏపీ బిజినెస్ వివరాలు.. హిట్ టాక్ రావాలి

Kingdom

Kingdom

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ ను విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టేలాగే ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Also Read : Tollywood : ఒకే సారి 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్న ‘యాత్ర 2’ మేకర్స్

ఈ నెల 31న కింగ్‌డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సితార రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే కింగ్‌డమ్ రిలీజ్ కాబోతుంది. ఏపీలో ( రాయలసీమ కాకుండా) ఈ సినిమాను రూ. 15 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ చేసారు మేకర్స్. సీడెడ్ ఏరియా వరకు రూ. 6 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ ఇచ్చారు. నైజాంలో సితార సంస్థ ఓన్ రిలీజ్ చేస్తుంది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఖర్చు కూడా భారీగానే అయింది. అయితే ఓటీటీ రూపంలో కింగ్‌డమ్ కు బాగానే గిట్టుబాటు అయింది. నెట్ ఫ్లిక్స్ నుండి రూ. 35 కోట్ల వరకు రికవరీ వచ్చింది. దాంతో థియేటర్స్ మీద కాస్త మినిమల్ రేట్స్ మీద ఇచ్చారనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తో విజయ్ మార్కెట్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. హిట్ టాక్ వస్తే ఈ రికవరి అనేది కష్టమేమి కాదు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కింగ్‌డమ్ ఏ మేరకు వసూళ్లు చేస్తోందో చూడాలి.

Exit mobile version