టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతోంది. కూలీ, కుబేరలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి సైడ్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్ పర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగ్.. తన 100 సినిమాను రెడీ చేస్తున్నడు. తమిళ దర్శకుడు రా కార్తీక్‌కు తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కింగ్.
Also Read : AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
సెంచరీ ఫిల్మ్ ఉందనే మాట కానీ.. పోస్టర్ కానీ.. పూజా వీడియో, కాన్సెప్ట్ వీడియోనో పంచుకోలేదు నాగార్జున. సినిమా ఎప్పుడు మొదలౌతుందోనని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు డోంట్‌వర్రీ.. సినిమా ఆల్రెడీ సెట్స్‌పైకి వెళ్లిపోయిందని చెప్పాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారట. ఈ మూవీకి లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. ఇదే కాదు… రీసెంట్‌గా మరో ఇంట్రస్టింగ్ మ్యాటర్ పంచుకున్నారు నాగ్. గత కొన్ని రోజులుగా నాగార్జునతో టబు నటిస్తుందన్న వార్తలు రాగా రీసెంట్‌గా దాన్ని నాగార్జున కన్ఫర్మ్ చేశాడు. మేం ఎప్పటి నుండో ఫ్రెండ్స్.. తాను 100వ సినిమా చేస్తున్నానని తెలిసి.. టబునే ఈ సినిమాలో పార్ట్ కావాలనుకుందని వెల్లడించాడు.అయితే ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందట. ఇందులో కర్ణాటకలో పెరిగిన తమిళ అమ్మాయి సుస్మితా భట్ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఫిక్సైనట్లు సమాచారం. కింగ్ 100 సినిమా రిలీజ్ విషయంలో తొందర పడటం లేదని, ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయంటున్నాడు నాగ్. ఈసారి వీఎఫ్ఎక్స్ తరహా యాక్షన్ సన్నివేశాలుండవని.. ప్రేక్షకులు కోరుకుంటున్న రియల్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయంటున్నాడు. ఆల్‌సెట్ ఇక మూవీ అప్డేట్స్ కూడా ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. మరి త్వరలో కాన్సెప్ట్ వీడియోనో, టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఏది చేస్తారో… లెట్స్ వెయిట్
