Site icon NTV Telugu

KING : వరదల్లో చిక్కుకున్న హీరో అక్కినేని నాగార్జున..

Nagarjuna

Nagarjuna

తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి. మరి ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో తుఫాను దాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనంతపురంలోని వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కాగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. కింగ్ నాగార్జున ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ కళ్యాణ్ జువెల్ర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Also Read : AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?

ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున అనంతపురం లోని కళ్యాన్‌జ్యువలర్స్ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ కు నేడు అనంతపురం వెళ్ళవలసి ఉంది. అందు నిమిత్తం ఈ ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన అనంతపురం చేరుకునేందుకు కారులో బయలుదేరారు. కానీ ధర్మవరం నుండి అనంతపూర్ కు వెళ్లే ప్రధాన రహదారి పై వరద నీరు ప్రవహిస్తుండంతో హై వే మధ్య లో ఇరుక్కుపోయారు. ధర్మవరం – అనంతపూర్ హైవే పై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండంతో పెనుకొండ మీదుగా అనంతపురం కి చేరుకోనేలా ప్రయత్నిస్తున్నారు సినీ నటుడు నాగార్జున. సత్యసాయి జిల్లా పోలీసులు నాగార్జున ను అనంతపురం కి సేఫ్ గ తరలించే ప్రయత్నం లో వున్నారు. ప్రస్తుతం మరూర్ టోల్ గేట్ వద్ద అక్కినేని నాగార్జున కారులో వెయిట్ చేస్తున్నారు. వరద ప్రవాహన్నీ అనంతపురం చేరుకునేందుకు  రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.

Exit mobile version