Killer: జగతి ఆంటీ ‘కిల్లర్’ గ్లింప్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్, ఇప్పుడు సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ **‘కిల్లర్’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరోయిన్‌గా జ్యోతి రాయ్ నటిస్తుండగా, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30, 2025న ‘కిల్లర్’ మూవీ గ్లింప్స్ తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో కూడిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హై-క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్, గ్రిప్పింగ్ విజువల్స్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.
Read More: Kingdom: ‘హృదయం లోపల’ ఏదోలా ఉందంటున్న దేవరకొండ
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
“ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యకరమైన మానవ మేధస్సు రహస్యాలు… ఆత్మ కలిగిన యంత్రాలు నిజమవుతాయా?” అనే ఆకర్షణీయమైన వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. హీరోయిన్ జ్యోతి రాయ్ ‘డీ బౌండ్’ అనే అరుదైన డిజార్డర్‌తో బాధపడుతూ, దాన్ని జయిస్తే పునర్జన్మ లాంటిదని, అప్పుడు ఆమెను ఎదురించడం ఎవరి తరం కాదని చెప్పే సన్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. జ్యోతి రాయ్ సూపర్ షీ క్యారెక్టర్‌లో చేసిన స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆమె సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలుస్తాయని టీం చెబుతోంది. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ హింట్ ఇస్తోంది. చివర్లో హీరోగా, దర్శకుడిగా పూర్వాజ్ చెప్పిన “మొదలెడదామా?” అనే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!