Site icon NTV Telugu

Kiara : కియారా అద్వానీ బేబి బంప్ ఫోటోలు వైరల్..

Kiyara

Kiyara

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియ‌రా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ అంటూ సందడి చేసింది. ఆ తరువాత మళ్లీ బాలీవుడ్‌ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస చిత్రాలు చేసింది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు,తమిళ, హిందీ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఇక కియారా, హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరి జంట చూడ ముచ్చట‌గా ఉంటుంది. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ఈ జంట గుడ్ న్యూస్ కూడా చెప్పారు. కానీ అప్పటి నుంచి కియార ఎలాంటి అప్ డేట్ కానీ ఫోటోలు కానీ రివిల్ చేయలేదు. అయితే తాజాగా..

Also Read : Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025.. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో భాగం అయ్యారు. ఈసారి కొంతమంది సెలబ్రిటీలు మెట్ గాలా లో మొదటిసారిగా పాల్గొనబోతున్నారు, వారిలో కియారా అద్వానీ ఒకరు. గర్భవతి అయిన కియారా అద్వానీ మొదటిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో, తొలిసారి మెట్ గాలాలో కియారా మెరిసింది. అలాగే, ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసింది. సింగర్ దిల్జిత్ దోసాంజ్.. పంజాబీ స్టైల్ లో రాయల్టీని ప్రదర్శిస్తూ మెట్ గాలాలో మెరిశాడు. ఈ వేడుకలో పాల్గొన్న తారల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version