Site icon NTV Telugu

Kiara : నేను నీ డైపర్లు మారిస్తే.. నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశా‌వ్

Kiara

Kiara

అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కియారా, కూతురు పుట్టాక తన జీవితం ఎలా మారిపోయిందో రీసెంట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Coolie : ‘కూలీ’ లో మరో ట్విస్ట్..యంగ్ రజనీ పాత్రలో స్టార్ హీరో ఎంట్రీ !

కూతురితో గడుపుతున్న అమూల్యమైన క్షణాలను పంచుకుంటూ, “నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావ్. ఈ డీల్ చాలా బావుంది” అనే కోట్‌తో కూడిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దానికి హార్ట్ సింబల్, కళ్లలో నీళ్లు తిరిగే ఎమోజీలను కూడా జోడించింది. మొత్తానికి కియార తల్లిగా తన బాధ్యతలు పోషిస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, కియారా నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా, యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా కియారా నటిస్తోంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘పరం సుందరి’ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ జంట ఇటు తల్లిదండ్రులుగా.. హీరో హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

Exit mobile version