NTV Telugu Site icon

Khans: ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?

Khand

Khand

బాలీవుడ్ బాక్సాఫీసుపై డామినేషన్ అంటే త్రీ ఖాన్స్‌దే. అది బాహుబలికి ముందు మాట. టాలీవుడ్ హీరోలు నార్త్ బెల్ట్ కబ్జా చేశాక.. కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హవా చూపించడంలో తడబడుతున్నారు. వీరిలో కింగ్ ఖాన్ కాస్త బెటర్. సక్సెస్‌ కంటిన్యూ చేస్తూ ఛరిష్మాను కాపాడుకుంటున్నాడు. ఇక హీరోగా కన్నా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాడు అమీర్ ఖాన్. సల్లూ భాయ్ షూటింగ్స్‌లో తక్కువ.. న్యూసుల్లో ఎక్కువ నిలుస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు త్రీఖాన్స్. డంకీ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ షారూఖ్ ఖాన్. అయితే సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ మూవీకి కమిటయ్యాడని సమాచారం. ఇందులో తన డాటర్ సుహానా ఖాన్ యాక్ట్ చేస్తోంది. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ సింగం ఎగైన్‌, అప్ కమింగ్ మూవీ బేబీ జాన్‌లో క్యామియో రోల్స్‌కు మాత్రమే ఫిక్సయ్యాడు.

JP Nadda: తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం

డెత్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో భారీ సెక్యూరిటీ మధ్యలో సికిందర్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరిదీ ఒకదారి అయితే.. అమీర్ ఖాన్‌ది మరోదారి. హీరోగా కంటే నిర్మాతగా సక్సెస్ కొడుతున్నాడు. ప్రజెంట్ తన నిర్మాణ సంస్థలో తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకన్న ఈ మూవీ క్రిస్మస్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25నే రావాల్సి ఉండగా.. వస్తుందో, రాదో కూడా తెలియదు. సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇందులో బొమ్మరిల్లు భామ హాసిని అలియాస్ జెనీలియా డిసౌజా యాక్ట్ చేస్తోంది. గత ఏడాది నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ బరిలో నిలవడంతో.. సినిమా ప్రమోట్ చేయడంలో బిజీగా మారిపోయాడు అమీర్. దీంతో సితారే జమీన్ పర్ పక్కన పెట్టేసినట్లు టాక్. మరీ ఈ సినిమా క్రిస్మస్‌కు వస్తుందో లేదో అన్నది డౌటే..

Show comments