NTV Telugu Site icon

KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?

Untitled Design (55)

Untitled Design (55)

కన్నడ హీరో యశ్‌, ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. రిలీజ్ అయిన మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో దూసుకువెళ్లింది. ఇక KGF -2 భారీ అంచనాల మధ్య విడుదలై వరల్డ్ వైడ్ గా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది ఈ చిత్రం. ఈ రెండు సినిమాలతో అటు నటుడు యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగింది.

Also Read : Mahesh Babu: రీరిలీజ్ లో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్న మహేశ్ సినిమా.. కలెక్షన్స్ ఎంతంటే..?

కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 ఇండియన్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల సరసన చేరి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ చిత్ర ఎండింగ్ లో సిక్వెల్ ఉండే అవకాశం ఉన్నట్టు చిన్న హింట్ వదిలాడు ప్రశాంత్ నీల్. కాగా తమిళ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ KGF-3 తప్పక ఉంటుందని తెలుస్తోంది.తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ ఈ సీరిస్ లో నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా గత శనివారం జరిగిందని, అజిత్ కుమార్ కెరీర్ లో 64 వ సినిమాగా KGF-3 ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ అజిత్ తో రెండు సినిమాలు తెరకెక్కించనున్నాడు ప్రశాంత్ నీల్. అజిత్ తో నిర్మించే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది హోంబాలే ఫిల్మ్స్.

Also Read : Nani: 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలవడం పట్ల నేచురల్ స్టార్ నాని ఫస్ట్ రియాక్షన్..
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ -2కూడా ఉంది. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత అజిత్ చిత్రం స్టార్ట్ చేస్తాడా, ఎప్పుడన్నది క్లారిటీ రావాలి. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనుండడంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Show comments