కరోనా సెకండ్ వేవ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఇంకా విడుదల కాలేదు. చాలా రోజుల తరువాత ఇప్పుడిప్పుడే వెండితెరపై బొమ్మ పడుతోంది. దీంతో విడుదల వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బిగ్ స్టార్స్ తలపడబోతున్నారన్న విషయం తెలిసిందే. ఒక్కో రోజు గ్యాప్ తో పవన్, మహేష్, ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మిగతా భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఒక్కొక్కటిగా తమ సినిమాల రిలీజ్ కు సంబంధించిన అప్డేట్స్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ జవనారి 12న, సర్కారు వారి పాట జవనరి 13న, రాధేశ్యామ్ జనవరి 14న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి.
Read Also : రిలీజ్ డేట్ ప్రకటించిన “పుష్ప”రాజ్
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ఎలాంటి చడీచప్పుడూ లేకుండా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా “పుష్ప” చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ఈ రోజు ఉదయమే అధికారికంగా ప్రకటించారు. గంధపు చెక్కల స్మగ్లింయిగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం డిసెంబర్ 25న విడుదల కానుంది. మరోవైపు భారీ అంచనాలతో రూపొందిన “కేజీఎఫ్-2” చిత్రం “పుష్ప”రాజ్ కు పోటీగా రానుంది అంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ “కేజీఎఫ్”కు సీక్వెల్ గా ఈ “కేజీఎఫ్-2″ను రూపొందించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనానే రిలీజ్ కు బ్రేకులు వేసింది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్ల రీఓపెన్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక పెద్ద సినిమాలన్నీ విడుదలకు వరుస కడుతుండడంతో ఇప్పుడు డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో “పుష్ప”రాజ్ ను యష్ “కేజీఎఫ్-2” ద్వారా ఢీ కొట్టబోతున్నాడు అంటున్నారు. “కేజీఎఫ్-2” నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ ఈ వార్తలపై ఓ క్లారిటీ రాదు.