Site icon NTV Telugu

Ketika Sharma : నిర్మాతల బెస్ట్ ఛాయిస్‌గా మారిన ‘సింగిల్’ బ్యూటీ..

Ketika Sharma

Ketika Sharma

తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ కెరీర్‌ను నిలబెట్టుకుంటుంటారు. అలాంటి ప్రయాణంలోనే ఇప్పుడు కేతిక శర్మ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక, ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో, రాబిన్ హుడ్ వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించింది. కానీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. కానీ

Also Read : SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి మూవీపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇటీవల విడుదలైన ‘సింగిల్’ సినిమాతో ఆమెకు డీసెంట్ హిట్ లభించింది. ఇది కేతిక కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌ల్లా మారింది. ఈ విజయంతో చిన్న, మధ్యతరహా నిర్మాతల దృష్టి ఇప్పుడు కేతిక పై పడింది. పారితోషికం తక్కువగా ఉండటం, యంగ్ హీరోల పక్కన కంపాటబుల్‌గా కనిపించగలగడం వంటి అంశాలు ఆమెకు ప్లస్‌ పాయింట్స్‌గా మారాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ఆమె పై కెరీర్ ముగిసినట్లే అన్న వార్తలుండగా, ఇప్పుడు ‘సింగిల్’ విజయంతో కొత్త ఊపిరి లభించింది. రాశీ ఖన్నా తరహాలోనే అవకాశాల వేటలో కేతిక శర్మ ప్రయాణం కొనసాగుతుందనటంలో సందేహం లేదు. త్వరలోనే ఆమె కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం.

 

Exit mobile version