ఏమాత్రం ఎక్స్ పీరియర్స్ లేని జోన్‌లోకి ఎంటరౌతోంది సంయుక్త మీనన్. ఇప్పటి వరకు 80 నుండి 90 పర్సంట్ సక్సెస్ రేష్యోతో తన ఫెలో భామలకు దక్కని యునిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న ఈ కేరళ కుట్టీ రిస్కుకు రెడీ అయ్యింది. బీమ్లా నాయక్‌తో టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన మరో మలయాళ సోయగం సంయుక్త మీనన్. విరూపాక్షతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తక్కువ టైంలోనే క్రేజీ బ్యూటీగా నేమ్, ఫేమ్ తెచ్చుకుంది. గ్రిప్పింగ్ అండ్ సెలక్టివ్ స్టోరీలను ఎంచుకుని వావ్ అనిపిస్తోంది. ఇప్పటి వరకు సౌత్‌లో హడావుడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు నార్త్ బాట పడుతోంది. తన కెరీర్ విషయంలో సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతూనే మరో రిస్క్‌కు రెడీ అవుతోంది.
Also Read : Suriya : ప్రభాస్‌ను ఫాలో అవుతోన్న తమిళ హీరో సూర్య
త్రీ ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది సంయుక్త మీనన్. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదారు సినిమాలున్నాయి. అన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఓన్ ఇండస్ట్రీ మలయాళంలో రామ్, నిఖిల్ స్వయంభు, శర్వానంద్ 37లో, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మూవీకి కమిటయ్యింది. మహరాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్‌తో నార్త్ బెల్ట్‌లో అటెన్షన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇదే కాదు రాక్షసి అనే లేడీ ఓరియెంట్ సినిమాలో హీరోయిన్‌గా మాత్రమే కాదు, సహ నిర్మాతగానూ డ్యూయల్ రోల్ పోషించనుంది సంయుక్త. యోగేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంట్ పిక్చర్స్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రౌడీలను చెగుడు ఆడేసుకోనుంది ఈ భామ. తన ఫెలో హీరోయిన్లలా బాలీవుడ్‌తో పాటు లేడీ ఓరియెంట్ చిత్రాల్లో కనువిందు చేస్తోన్న సంయుక్త.