Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌తో జాతీయ అవార్డును అందుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ మలయాళ బ్యూటీ.. ఇటీవలి కాలంలో బాగా సన్నబడి కనిపించడంతో ఆమె లుక్‌పై రకరకాల కామెంట్లు వచ్చాయి. కొందరైతే ఆమె లైపోసక్షన్ లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందని పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కీర్తి సురేష్ తన వర్కవుట్ వీడియోతో పాటు ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
తమ అందాన్ని కాపాడుకోవడానికి హీరోయిన్లు పడే కష్టాన్ని వివరిస్తూ.. ‘2013లో నేను నటిగా కెరీర్ ప్రారంభించినప్పుడు జిమ్ అనేది నా కోసం కాదు అనుకున్నాను. కానీ 2018లో ‘మహానటి’ సినిమా తర్వాత వచ్చిన విరామంలో నా శరీరంపై దృష్టి పెట్టాలనుకున్నాను. హై ప్రొటీన్, లో కార్బ్ డైట్‌తో పాటు హెచ్ఐఐటీ (HIIT), కార్డియో వ్యాయామాలు తీవ్రంగా చేశాను. అలా కష్టపడి 9 నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను. కానీ, ప్రజలు నన్ను చూసి ‘చాలా వీక్‌గా అయిపోయావు’ అనడమే కాకుండా.. ‘సర్జరీలు చేయించుకుంది’ అని మాట్లాడటం నన్ను తీవ్రంగా బాధించింది. నేను నా ముఖానికి, శరీరానికి ఎప్పుడూ నేచురల్ పద్ధతులనే పాటిస్తాను. నా కష్టమంతా ఇలా ఒక కత్తి (సర్జరీ) ఖాతాలోకి వెళ్ళిపోవడం చూసి బాధేసింది. తొలిరోజుల్లో కేవలం కార్డియో మాత్రమే చేయడం వల్ల నా కండరాలు (Muscle loss) కోల్పోయి బాగా సన్నగా కనిపించా. ఆ తర్వాత 2020 లాక్డౌన్ సమయంలో యోగా వైపు మళ్లాను. అది నాకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ప్రస్తుతం నా దినచర్యలో యోగాతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, యానిమల్ ఫ్లో, కాలిస్థెనిక్స్ వంటి వ్యాయామాలను సమతుల్యం చేసుకుంటూ హెల్తీగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అలాగే జనాల మనస్తత్వంపై స్పందిస్తూ.. ‘నేను లావుగా ఉన్నప్పుడు సన్నబడమన్నారు.. కష్టపడి సన్నబడిన తర్వాత పాత లుక్కే బాగుంది, ఇప్పుడు బాలేదంటున్నారు. అసలు ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో అర్థం కాక కొన్నిసార్లు ఆశ్చర్యమేస్తుంది’ అని కీర్తి చెప్పుకొచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా తాను మీడియాకు, సినిమాలకు కాస్త దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా కీర్తి బయటపెట్టారు. ఇటీవల తాను శారీరకంగా, మానసికంగా కొన్ని ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నానని, అందుకే విరామం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!