Site icon NTV Telugu

Keerthi Suresh : అన్ని భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తాను..

Keerthi Suresh

Keerthi Suresh

హీరోయిన్ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్‌లలో చాలా మార్పు వస్తుంది. అలా కీర్తి లో వచ్చిన మార్పు మాత్రం ఎవరూ ఊహించనిది చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా.. రొమాంటిక్ సిన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు .. ఇప్పుడు ఒక్కసారిగా విపరీతం అయిన స్కీన్ షో మొదలు పెట్టింది.. బాలీవుడ్‌లో ‘బేబీ జాన్’తో అడుగుపెట్టినప్పటి. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించ‌బోతున్నట్లు తెలుస్తుంది. పాత పద్ధతిలో వెళితే పని అవ్వదని గ్రహించిన ఈ అమ్మడు రూట్ మార్చింది.. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది..

Also Read : Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !

‘నా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇలా ప్రతి భాషకు, సమాన ప్రాధాన్యత ఇచెందుకు ప్రయత్నిస్తున్నా, ఇలా బహుశ భాషల్లో పని చేయడం సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఈ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. అంతేకాదు ఇది నా నటనా పరిధిని విస్తరించేందుకు సహాయపడుతుంది. ఒక్కప్పుడు వరుస అవకాశాలు వస్తున్నప్పటికి, కోన్ని విషయాల్లో ముందు వెనుక ఆలోచించేదాన్ని, కానీ కెరీర్ కోసం.. నా అభిమానుల కోసం ఎంత దూరం అయిన వెళ్తాను.. ప్రయత్నిస్తూనే ఉంటాను’.. అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version