Site icon NTV Telugu

Keeravani : ‘వీరమల్లు’ లో ఐటెం సాంగ్.. కానీ పవన్ ఏమన్నారంటే !

Pawan Kalya , Veera Meeramalu

Pawan Kalya , Veera Meeramalu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి – జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. నిధి అగర్వాల్, బాబీ డియోల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూన్ 12న ఈ సినిమా విడుదలవుతున్న నైపద్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్.

Also Read : kayadu lohar: డ్రాగన్ భామ పై సంచలన ఆరోపణలు.. లిక్కర్ స్కాం నిందితులతో..?

ఇప్పటికే విడుదలైన పాటలు ఎంతో ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతంగా ‘అసుర హననం’ విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమా‌ని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతల‌తో నిర్వహించడం విశేషం. ఇందులో భాగంగా కీరవాణి మాట్లాడుతూ.. ‘ ‘హరి హర వీరమల్లు’ సినిమా‌తో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతి కృష్ణ తో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకుల‌ను చూశాను. కానీ, తక్కువ మందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంది.. ‘తార సితార’ అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ తెలిపారు.. ఆయన ప్రస్తుతం బాధ్యతాయుతమైన పదవిలో ఉండటంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని తెలిపారు. వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డింగ్ చేయించాము’ అని కీరవాణి అన్నారు.

Exit mobile version