NTV Telugu Site icon

KCR : నేను ఎప్పుడు రోజాని ఏమీ అనలేదు : హైపర్ ఆది

Hyperaadi

Hyperaadi

జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నరాకింగ్ రాకేశ్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం KCR ( కేశవ చంద్ర రామావత్). ‘గరుడవేగ’ ఫేమ్‌ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య కృష్ణన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ రావు, హైపర్ ఆది, రోజా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Also Read : Ram Charan : ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్

ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ ‘అందరికి నమస్కారం, ముందుగా ఈ రోజు ఈవెంట్ కు విచ్చేసిన రోజా గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళి ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఈమెని ఎప్పుడు ఏమి అనలేదు. అసలు అనను కూడా. నిజంగా ఎప్పుడు ఏమి అనలేదు. అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారు. సరే రాసుకొండి మీ వ్యూస్ కోసం ఎదో ఒకటి రాయాలి కాబట్టి. అలాగే తెలుగు సినిమా ఇప్పుడు చాలా బాగుంది. పుష్ప సినిమాతో తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు సినిమాలు, పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పొలిటికల్ గా గెలవడం టాలీవుడ్ ఇప్పుడు చాలా సంతోషంగాఉంది’ అని అన్నారు.

Show comments