Site icon NTV Telugu

Kayadu Lohar : ‘ది ప్యారడైజ్’ తో సహా వరుస సినిమాలు లైన్ లో పెట్టిన డ్రాగన్ బ్యూటీ..

Kayad Lohar (2)

Kayad Lohar (2)

ఒక్క ఫ్లాప్ కిందకు తొక్కిస్తే.. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. అప్పటి వరకు కనీసం గుర్తించని జనాలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ప్రజంట్ ‘డ్రాగన్’ మూవీ రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కయదు లోహర్ విషయంలో ఇదే జరుగుతుంది. ‘డ్రాగన్’ మూవీ లో చూసే దాకా తనలో ఉన్న మేజిక్ జనాలకు అర్థం కాలేదు. దీంతో ఇప్పుడు తన డిమాండ్ తెలుగు తమిళ భాషల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో పెట్టినట్లు టాక్..

నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోయే ‘ది ప్యారడైజ్’ మూవీలో కయదు లోహర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇది చాలా పెద్ద ఆఫర్ అనే చెప్పాలి. ఇక ఇప్పటికే విశ్వక్ సేన్ ‘ఫంకీ’ లో ఒకే అయిందట ఈ ముద్దుగుమ్మ. అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్‌టైనర్ షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. అలాగే అధర్వ – తమన్ నటిస్తున్న సినిమా, శింబుతో ఒక మూవీ, నివిన్ పౌలి తో ఒక చిత్రం, జీవీ ప్రకాష్ కుమార్ తో మరొకటి ఇలా వరుస సినిమాలు తన ఖాతాలో పడ్డాయని చెన్నై రిపోర్ట్. అంతే కాదు టాలీవుడ్ లో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబో కోసం కూడా కయదు లోహర్‌ను సంప్రదించినట్టు లేటెస్ట్ అప్డేట్ దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారైనట్లే. ఇలా మొత్తం అరడజను పైగా కమిట్ మెంట్లతో ఉన్న కయదు లోహర్ లిస్ట్ తీసుకుంటే.. ఇంకో రెండేళ్ల దాకా కాల్ షీట్లు దొరకడం అనుమానం అనే చెప్పాలి. ఇంకో రెండు మూడు హిట్లు పడ్డాయంటే భామ పూర్తిగా సెటిలైనట్టే.

Exit mobile version