> కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదంటూనే, ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి కేవలం నాని సరసన ప్రేమపావురంలా కాకుండా, గ్రే షేడ్స్‌తో కూడిన రిస్కీ అండ్ వివాదాస్పద స్వభావంతో ఆడియన్స్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతోందని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటివరకు వెండితెరపై క్యూట్, బబ్లీ హీరోయిన్‌గా కనిపించిన కయాదు లోహర్, ‘ది ప్యారడైజ్’లో పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపించబోతోంది. జడల్ పాత్రలో నటిస్తున్న నాని ప్రేమజంటగా మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సుబ్బలక్ష్మికి సమాంతరంగా సాగే మరో డార్క్ జర్నీ ఉంటుందని ఆమె తెలిపింది.
సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో కథానాయికల పాత్రలను అంత బలంగా రాయరని విమర్శిస్తూనే, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌లో బోలెడన్ని నెగెటివ్/గ్రే షేడ్స్, ఆశ్చర్యపరిచే సర్‌ప్రైజ్‌లు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ రోల్ చేయడం తనకు ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని, తన నటన ప్రేక్షకులకు కచ్చితంగా షాక్ ఇస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక తెలుగులో అల్లూరి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా ఈ భామకు ఎందుకో లక్ కలిసి రాలేదు. కానీ తమిళంలో చేసిన డ్రాగన్ సినిమా తెలుగులో కూడా వర్కౌట్ అవ్వడంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు దక్కుతున్నాయి.

