కన్నడ టెలివిజన్ పరిశ్రమలో ‘కెందసంపిగే’ సీరియల్‌తో ప్రజాదరణ పొందిన నటి కావ్య శైవ ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఆమె నటించిన తొలి చిత్రం ‘కొత్తలవాడి’ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని కన్నడ సినీ పరిశ్రమలో ‘రాకింగ్ స్టార్’గా పేరొందిన యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ నిర్మించారు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కావ్య శైవకు ఈ విషయం తెలియదని తాజాగా ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూ సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Also Read : Vijay: సారీ కాదు.. న్యాయం కావాలి.. లాకప్‌డెత్‌పై విజయ్ ఆగ్రహం
‘కొత్తలవాడి’ చిత్రం షూటింగ్ మరియు డబ్బింగ్ పూర్తయిన తర్వాతే తమకు నిర్మాత గురించి తెలిసిందని కావ్య శైవ తెలిపారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “సినిమా షూటింగ్ సమయంలో నాకు పుష్ప అరుణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాత అని తెలియదు. షూటింగ్ పూర్తయిన తర్వాత, హసన్‌లోని ఒక బ్యాంకు నుండి నాకు రెమ్యునరేషన్ వేశారు . నేను దర్శకుడికి ఫోన్ చేసి, ‘సార్, హసన్‌లోని పుష్ప అరుణ్ కుమార్ అనే బ్యాంకు ఖాతా నుండి రెమ్యునరేషన్ వచ్చింది’ అని చెప్పాను. అప్పుడు ఆయన, ‘కావ్య, నీవు కొన్ని రోజుల్లో నిర్మాతను కలుస్తావు’ అని సమాధానం ఇచ్చారు” అని కావ్య వెల్లడించారు. చిత్ర బృందం నిర్మాతను మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కావ్య, “సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తయిన తర్వాతే మేము పుష్ప అరుణ్ కుమార్‌ను కలిశాము. ఆ సమయంలో ఆమె ఈ చిత్రానికి నిర్మాత అని తెలిసింది” అని పేర్కొన్నారు.
Also Read : Kollywood : లోకేశ్ కనగరాజ్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
ఈ సందర్భంగా నిర్మాత పుష్ప అరుణ్ కుమార్ మాట్లాడుతూ “సినిమా పూర్తయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి. అందుకే మేము ఆర్టిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడాము. చిత్ర బృందం మా బ్యానర్ గురించి తెలుసుకోవాలని మేము కోరుకోలేదు, ఎందుకంటే సినిమా నాణ్యతే ముఖ్యం” అని ఆమె అన్నారు. ‘కొత్తలవాడి’ చిత్రం యష్ తల్లి నిర్మాణంలో వస్తున్న మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీ రాజ్ దర్శకత్వం వహించారు, మరియు పృథ్వీ అంబర్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
