NTV Telugu Site icon

Ram Charan : ‘RC 16’ కోసం ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ ఫినిష్..

Untitled Design (85)

Untitled Design (85)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజ‌ర్’ అంటూ వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచాడు.శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే క‌సితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Artiste : థ్రిల్లింగ్ మూవీ ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ రిలీజ్..

జాన్వీ కపూర్  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తుండగా, కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రబృందం శివన్న లుక్‌ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇక బుచ్చిబాబు ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు. సమాచారం ప్రకారం క‌థ‌లో భాగంగా.. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కొన్ని కీలకమైన‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట మేక‌ర్స్. ఈ షూటింగ్ కోసం మూవీ టీం ఇప్పటికే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకొగా అనుమ‌తుల కోసం ఎదురుచూస్తుందట. అంతే కాదు ఢిల్లీ లోని జమా మసీదు వద్ద కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.